భారతదేశం, ఆగస్టు 21 -- మీ ఇంట్లో, ముఖ్యంగా బెడ్‌రూంలో మీరు నిత్యం ఉపయోగించే కొన్ని వస్తువులు మీకు తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించవచ్చని మీకు తెలుసా? అలాగే, అవి మీ జీర్ణవ్యవస్థ, నిద్ర, అలాగే దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ అయిన డాక్టర్ సౌరభ్ సేథి జూన్ 14న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. వెంటనే పారేయాల్సిన 3 ప్రమాదకరమైన వస్తువుల గురించి ఆయన వివరించారు.

డాక్టర్ సేథి తన వీడియోలో ఈ మూడు వస్తువుల గురించి ప్రస్తావిస్తూ "మీ బెడ్‌రూమ్ మీ గట్ హెల్త్ (జీర్ణ ఆరోగ్యం), నిద్ర, దీర్ఘకాలిక ఆరోగ్యంపై సైలెంట్‌గా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ఎయిర్ ఫ్రెషనర్‌ల నుండి పాత పరుపుల వరకు, ఈ దాగి ఉన్న ప్రమాదాలను మనం పెద్దగా పట్టి...