భారతదేశం, డిసెంబర్ 8 -- హార్లీ డేవిడ్‌సన్ సంస్థ భారత మార్కెట్‌లో తన 440 సీసీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ.. కొత్తగా ఎక్స్​440 టీ మోడల్‌ను విడుదల చేసింది. పైపైన చూస్తే ఈ ఎక్స్​440 టీ, ఎక్స్​440 ఒకేలా అనిపించినప్పటికీ, ఈ రెండు బైక్స్​ మధ్య అనేక తేడాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఇక్కడ తెలుసుకోండి..

ఎక్స్​440 టీ మోడల్‌లో కంపెనీ ఫీచర్ల సెట్‌లో మార్పులు చేసింది.

రైడ్-బై-వైర్: ఈ కొత్త బైక్​లో రైడ్-బై-వైర్ టెక్నాలజీని జోడించారు. దీని సహాయంతో కంపెనీ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌ను అందించగలిగింది.

ట్రాక్షన్ కంట్రోల్: ఇది స్విచ్చెబుల్​. అంటే, రైడర్లు తమకు అవసరమైనప్పుడు దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ముఖ్యంగా రేర్​ వీల్​ స్లిప్ అవుతున్నప్పుడు గుర్తించి, పవర్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల రైడర్ నియంత్రణ కోల్పోకుండా ఉంటాడు.

రైడి...