భారతదేశం, జూన్ 25 -- టీమిండియా ఆల్ రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా మధ్య ప్రేమాయణం గురించి కొంతకాలంగా ఎడతెగని చర్చ సాగుతోంది. వీళ్లు డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు బలంగా వినిపించాయి. వీళ్లు ఒకట్రెండు సార్లు బయట కలిసి కనిపించారు కూడా. కానీ హార్దిక్ పాండ్యతో రిలేషన్ షిప్ గురించి ఇషా రీసెంట్ గా ఓపెన్ అయింది. డేటింగ్ కు ముందే తమ రిలేషన్ షిప్ బ్రేకప్ అయిందని హాట్ కామెంట్లు చేసింది.

సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్య తో లవ్, డేటింగ్ గురించి ఇషా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. "అవును, కొంతకాలం మేము మాట్లాడుకున్నాం. మేము డేటింగ్ చేస్తున్నామని నేను అనుకోను. అది డేటింగ్ కావచ్చు, కాకపోవచ్చు అనే స్టేజ్ లో ఉండేవాళ్లం. కానీ డేటింగ్ దశకు చేరుకునే ముందే రిలేషన్ షిప్ బ...