Hyderabad, అక్టోబర్ 10 -- తెలుగులో హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ ఎర్రచీర - ది బిగినింగ్. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎర్రచీర - ది బిగినింగ్ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్ర పోషించింది.

"ఎర్రచీర - ది బిగినింగ్" సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. హార్రర్, యాక్షన్‌కు మదర్ సెంటిమెంట్ యాడ్ చేసిన స్టోరీగా ఈ చిత్రం ఎర్రచీర రూపొందింది. తాజాగా ఎర్రచీర ది బిగినింగ్ సినిమాకు సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఎర్రచీర చూసిన సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎర్రచీర డైరెక్టర్ సుమన్ బాబు మాట్లాడుతూ.. "హార్ట్ పే...