Hyderabad, సెప్టెంబర్ 8 -- బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ సినిమా 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన కిష్కిందపురి ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది. కిష్కిందపురి మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో కిష్కిందపురి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

-డైరెక్టర్ కౌశిక్ ఈ కథని గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. చాలా నచ్చింది. జూలై నుంచి షూటింగు మొదలుపెట్టాము. చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ ఇది.

-ఇప్పటివరకు చాలా హారర్ కథలు వచ్చాయి. అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్‌గా ఉంటుంది....