భారతదేశం, జనవరి 30 -- తెలుగు హీరోయిన్ కోమ‌లి ప్ర‌సాద్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్ మూవీస్‌తో అలరించిన కోమలి ప్రసాద్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమానే 'మండవెట్టి'. ఇది ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూప‌ర్ నేచుర‌ల్ హారర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోంది.

కోమలి ప్రసాద్ సినీ కెరీర్‌లో ఇదొక ముఖ్య‌మైన, కొత్త చాప్ట‌ర్‌ అని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ప్రేక్ష‌కుల ప్రేమ‌, ఆశీస్సులు కావాల‌ని కోమ‌లి ప్రసాద్ మ‌న‌స్ఫూర్తిగా కోరారు. 'మండ‌వెట్టి' సినిమాను ప్రారంభించ‌టం త‌మ‌కెంతో గర్వంగా ఉంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

ట‌స్క‌ర్స్ డెన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న మండవెట్టి సినిమాకు శ‌ర‌ణ్ రాజ్ సెంథిల్‌ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. తాజాగా మండవెట్టి మూవీ టీమ్‌ లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించిం...