భారతదేశం, ఆగస్టు 23 -- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారాం అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. వీటిలో కొన్ని స్పెషల్ గా ఉన్నాయి. వీకెండ్ లో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ ఇవే.

హారర్ థ్రిల్లర్ మూవీ 'మా'. ఇది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. తమ పూర్వీకుల ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత ఒక కుటుంబాన్ని వెంటాడే భయానక దుష్ట శక్తి కథ ఇది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూ, ఆ ఇంటి గతంలోని చీకటి రహస్యాలను తల్లి వెలికితీస్తుంది. కాజోల్, యానీయా భరద్వాజ్, దిబ్యేందు భట్టాచార్య తదితరులు నటించారు. ఆగస్టు 22న ఓటీటీలో రిలీజైంది.

వివాహిత దంపతుల గురించి తెలిపే తమిళ రొమాంటిక్ కుటుంబ కథ ఇది. రోడ్డు పక్కన ఉన్న హోటల్ నడిపే ఆగాసవేరన్, గ్రాడ్యుయేట్ పెరరసితో ప్రేమలో పడతాడు. వివాహం తర్వా...