భారతదేశం, ఆగస్టు 4 -- హానర్ తన కొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీకి చెందిన ఈ లేటెస్ట్ ఫోన్ పేరు హానర్ ప్లే 70 ప్లస్. ఈ ఫోన్ చైనా మార్కెట్‌లోకి ప్రవేశించింది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్.

హానర్ ప్లే 70 ప్లస్ ఫోన్ 8 జీబీ ప్లస్ 256 జీబీ, 12 జీబీ ప్లస్ 256 జీబీ, 12 జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 1199 యువాన్లు (సుమారు రూ.14360). బ్లూ, బ్లాక్, పింక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ను లాంచ్ చేసింది. ఆగస్టు 8 నుంచి చైనాలో దీని సేల్ ప్రారంభం కానుంది.

ఈ ఫోన్ లో 6.77 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ప్యానెల్‌ను కంపెనీ అందిస్తోంది. ఫోన్‌లో అందించే ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. డిస్ ప్లేలో పలు ఐ ప్రొటెక్షన్ మోడ్స్, డీసీ డిమ్మింగ్...