భారతదేశం, అక్టోబర్ 7 -- 2025 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాల‌ర్ షిప్స్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని రోజులే టైమ్ మిగిలి ఉంది. అక్టోబర్ 15వ తేదీతో సమయం ముగుస్తుంది. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల‌కు నాలుగు సంవత్సరాలు స్కాల‌ర్ షిప్ అందుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వ‌సతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3,50,000 లోపు ఉండాలి. అలాగే ఏడో త‌ర‌గ‌తిలో 55 శాతం మార్కులు వ‌చ్చిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు 5 శాతం మార్కులు స‌డ‌లింపు ఉంటుంది. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగానే విద్యా...