భారతదేశం, డిసెంబర్ 19 -- మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. పీజీ వైద్యవిద్య చదువుతున్న ఓ పేద విద్యార్థినికి రుణం కోసం తన సొంత ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టారు. సదరు విద్యార్థినికి రూ. 20 లక్షల ఎడ్యూకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా అదనంగా హాస్టల్ ఫీజు కోసం రూ.లక్ష సాయం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపేటకు చెందిన మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చినా ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ. 7.50 లక్షలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకర్స్ తెలిపాయి. ఈ నెల 18వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటును తిరస్కరించే పరిస్థితి నెలకొంది.

ఇదే విషయాన్ని విద్యార్థిని మమత, తండ్రి...