Hyderabad, జూలై 14 -- హరి హర వీరమల్లు.. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సినిమా. రెండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన మూవీ రిలీజ్ కానుండటంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్ టైమ్ ఏకంగా 2 గంటల 42 నిమిషాలు అని మేకర్స్ రివీల్ చేశారు. ఇది చాలా ఎక్కువే అని చెప్పాలి.

హరి హర వీరమల్లు మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో వస్తున్న ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 2 గంటల 42 నిమిషాల భారీ నిడివితో వస్తున్న ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు.

చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ కనువిందు చేయనున్నాడు. నిరంకుశత్వానికి వ్య...