Hyderabad, జూలై 24 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు పార్ట్ 1 గురువారం (జులై 24) రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుందని మొదట మేకర్స్ చెప్పినా.. తొలి భాగానికి నెగటివ్ టాక్ తో అది వస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాత ఏఎం రత్నం కామెంట్స్ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి.

హరి హర వీరమల్లు మూవీ పార్ట్ 1 రిలీజ్ రోజు మేకర్స్ వివిధ ప్రాంతాల్లోని థియేటర్లలో అభిమానుల హడావిడి చూడటానికి వెళ్లారు. మూవీకి వస్తున్న రెస్పాన్స్ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఓ ఛానెల్ తో మాట్లాడాడు. రిపోర్టర్ సెకండ్ పార్ట్ సంగతేంటని అడిగారు.

పార్ట్ 2 ఎప్పుడు అనుకుంటున్నారు.. దాని గురించి చెప్పండని అన్నారు. దీనిపై రత్నం స్పందిస్తూ.. "లేదు.. ఈ సినిమా హిట్ అయిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తాం" అని అన...