Hyderabad, జూలై 21 -- ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. తాజాగా ఇవాళ (జూలై 21) హరి హర వీరమల్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ కల్యాణ్‌కు మైక్ ఇచ్చి మాట్లాడాల్సిందిగా యాంకర్ సుమ కోరారు. మైక్ చేతిలోకి తీసుకున్న పవన్ కల్యాణ్ "పోడియం లేకుండా మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. ఎలా ఉందంటే నగ్నంగా ఉన్నట్లు ఉంది పోడియం లేకపోయేసరికి. దయచేసి మీరందరు తీసుకురండి. ఇంట్రాక్షన్ కోసం. జీవితంలో మొదటిసారి ఇది. పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ, సినిమా పరంగా ఆలోచించలేదు" అని అన్నారు.

"ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్‌ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? ఈ నేపథ్యంల...