Hyderabad, ఆగస్టు 18 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాతో అట్రాక్ట్ చేసింది గ్లామర్ బ్యూటి నిధి అగర్వాల్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే, హరి హర వీరమల్లు సినిమా తర్వాత బిజీగా మారిపోయింది నిధి అగర్వాల్.

హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సమయంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ది రాజా సాబ్ సినిమాలో నటించింది నిధి అగర్వాల్. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది రాజా సాబ్‌ మూవీలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నిధి అగర్వాల్ కనిపించింది. ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానుంది బ్యూటిఫుల్ నిధి అగర్వాల్.

వరుస ఎగ్జయిటింగ్ ప్రాజెక్టులతో తన అభిమానులను అలరుస్తన్న నిధి అగర్వాల్ ఇప్పుడు ఓ గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్‌‌కి సైన్ చేసింది. నిధి అగర్వాల్ లీడ్ రోల్‌లో చేస్తున్న ఈ సినిమ...