Hyderabad, జూలై 24 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ రేంజ్‌లో అంచనాలు, ఇంట్రెస్ట్ తెలిసిందే. అలాంటిది, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసింది.

యానిమల్ విలన్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇక ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న హరి హర వీరమల్లు ఫైనల్‌గా ఇవాళ (జులై 24) థియేటర్లలో విడుదల కానుంది.

అయితే, రిలీజ్‌కు ఒకరోజే ముందు అంటే బుధవారం (జులై 23) రాత్రి నుంచే హరి హర వీరమల్లు పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. అవి చూసిన నెటిజన్స్ టాక్ ఎలా ఉందో హరి హర వీరమల్లు ట్విటర్ రివ్యూలో చూద్దాం.

"ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ మొదటి 40 నిమిషాలు యావరేజ్‌గా ఉంది. చివరి 40 నిమిషాలు బాగుంది. కీరవాణి బ్...