Hyderabad, జూలై 2 -- వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిస్టారిక్ మూవీ హరి హర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను గురువారం (జులై 3) మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే సిద్ధమైన ట్రైలర్ ను పవన్ కల్యాణ్ చూశాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను మూవీ టీమ్ షేర్ చేసింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కోసం ఎన్నో రోజులు అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ సమయం దగ్గర పడుతోంది. అంతేకాదు ఈ ట్రైలర్ పవన్ కు కూడా బాగా నచ్చేసినట్లు మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ హరి హర వీరమల్లు టీమ్ తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్ చూశాడు.

ట్రైలర్ చూస్తున్నంతసేపు పవన్ బాగా ఎంజాయ్ చేసినట్లుగా వీడియో చూస్తే తెల...