Hyderabad, జూలై 19 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇదే తొలి మూవీ కావడం విశేషం. ఈ సినిమా కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ హరి హర వీరమల్లు సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఐదు రోజుల ముందు టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ కు రూ.100, అప్పర్ క్లాస్ కు రూ.150 వరకు పెంచుకోవచ్చని తెలిపింది.

ఇక మల్టీప్లెక్స్ లలో రూ.200 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో గరిష్ఠంగా రూ.297, మల్టీప్లెక్స్ లలో రూ.377 వరకు టికెట్లు ధర...