Hyderabad, జూలై 30 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు. ఈ సినిమా ఐదేళ్ల పాటు ఊరించి భారీ అంచనాల మధ్య జులై 24న థియేటర్లలో రిలీజైంది. అయితే ఇప్పుడు నెల రోజుల్లోపే చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మూవీ రిలీజ్ కాబోతున్నట్లు బజ్ క్రియేటైంది.

హరి హర వీరమల్లు మూవీ సాధారణ ప్రేక్షకులనే కాదు పవన్ కల్యాణ్ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇందులో వీఎఫ్ఎక్స్, క్లైమ్యాక్స్ పై చాలా మంది పెదవి విరిచారు. ఆ ప్రభావం బాక్సాఫీస్ దగ్గర స్పష్టంగా కనిపించింది. తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించినా.. తొలి రోజుతో పోలిస్తే ఆ తర్వాతి రోజు నుంచే దారుణంగా పతనమయ్యాయి.

దీంతో ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమ...