Hyderabad, జూలై 27 -- పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు జూలై 24న థియేటర్లలో విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ, ఆ రెండో రోజు మాత్రం సుమారుగా 85 శాతం మేర కలెక్షన్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు 3 రోజుల కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం హరి హర వీరమల్లు సినిమాకు మూడో రోజు అయిన శనివారం ఇండియాలో రూ.9.86 కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇది రెండో రోజుతో పోల్చుకుంటే 23.25 శాతం పెరిగినట్లే. ఇండియాలో రెండో రోజున హరి హర వీరమల్లు సినిమాకు రూ. 8 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.

ఆ లెక్కన రెండో రోజుతో చూసుకుంటే మూడో రోజు హరి హర వీరమల్లు కలెక్షన్స్ పెరిగాయి. కానీ, ఓపెనింగ్స్ రోజుతో చూస్తే మాత్రం వసూళ్లు ఇంకా కోలుకోలేనట్లే కనిపిస్తోంది. అంటే, మొదటి రోజు గణాంకాలకు, 3వ రోజు గణాం...