Hyderabad, జూలై 25 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన సినిమా 'హరి హర వీరమల్లు'. భారీ అంచనాల నడుమ థియేటర్లలో జూలై 24న అడుగుపెట్టింది హరి హర వీరమల్లు. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలుకాగా హరి హర వీరమల్లు సినిమాకు టాక్ బాగానే ఉంది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో సత్తా చాటుతోంది హరి హర వీరమల్లు మూవీ. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ ఇద్దరు దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్‌కు జోడీగా హీరోయిన్ నిధి అగర్వాల్ చేసింది. సినిమాకు మంచి టాక్ వస్తున్న సందర్భంగా హరి హర వీరమల్లు విజయోత్సవ సభ నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. "థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. సినిమాని ముగించిన తీరు అద్భుతంగా ఉంది, రెండ...