భారతదేశం, జూన్ 11 -- పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' సినిమా ప్రొడక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయింది. షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ రిలీజ్ కు మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. ఇప్పటికే పలు మార్లు మూవీ విడుదల వాయిదా పడింది. రీసెంట్ గా జూన్ 12న థియేటర్లకు రావాల్సిన ఈ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే.. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడూ అని. రీసెంట్ గా జూన్ 26న ఈ మూవీ రిలీజ్ కాబోతోందని ఓ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కానీ ఆ పోస్టులను నమ్మొద్దని నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ కు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలిసింది....