భారతదేశం, మే 21 -- రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హయత్‌ నగర్‌ కుంట్లూరు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎంను వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఉదయం ఆరు గంటల సమయంలో ఎంహెచ్‌2 డిజి 0771 స్కోడా కారు కుంట్లూరు పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొంది. మృతి చెందిన వారిని సమీప గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో కుంట్లూరుకు చెందిన శ్రీనాథ్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, అనిరుథ్‌ రెడ్డిలుగా గుర్తించారు.

బంధువుల వివాహానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు బంధువులు వివరించారు. ప్రమాద సమాచారం తెలియడంతో మృతుల కుటుంబీక...