భారతదేశం, మే 21 -- రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హయత్‌ నగర్‌ కుంట్లూరు వద్ద ఆగి ఉన్న డీసీఎంను వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంతో హయత్‌ నగర్‌ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచి పోయింది. ఎంహెచ్‌2 డిజి 0771 స్కోడా కారు ఆగి ఉన్న డీసీఎంను ఢీకొంది. మృతి చెందిన వారిని సమీప గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమాచారం తెలియడంతో మృతుల కుటుంబీకుల ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permissio...