Hyderabad, మే 30 -- రజనీకాంత్ డిజాస్టర్ మూవీ లాల్ సలామ్ గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతోపాటు ఐఎండీబీలోనూ దారుణమైన రేటింగ్ సొంతం చేసుకుంది. గతేడాది డిసెంబర్ లోనే టీవీ ప్రీమియర్ అయిన ఈ సినిమా.. వచ్చే వారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన మూవీ లాల్ సలామ్. ఈ సినిమా దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడీ మూవీని బక్రీద్ సందర్భంగా జూన్ 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (మే 30) వెల్లడించింది.

బక్రీద్ కు ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ ఓ చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేసింది. అందులో రజనీకాంత్ ను చూడొచ్చు. థియేటర్లలో రిలీజైన సుమారు 16 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి....