భారతదేశం, సెప్టెంబర్ 11 -- గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో కేవలం 4 నెలల కాలంలో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతుచిక్కని వ్యాధితో స్థానికుల్లో భయం మెుదలైంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు జాతీయ సంస్థలు కూడా తురకపాలెంలో శాంపిల్స్ సేకరించాయి. కొన్ని రోజులపాటు.. ఒక ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపు మరొకరి ఇంట్లో చావు చూడాల్సి వచ్చింది. అయితే పరిస్థితులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి.

తురకపాలెం గ్రామానికి చెందిన 102 మంది అనారోగ్య రోగుల బ్లడ్ నివేదికలలో ఎక్కువ మందికి మెలియోయిడోసిస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదని తేలింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కలిగించే అంశం. వారి రక్త నమునాల నివేదిక విశ్లేషణ ప్రకారం, 102 మంది రోగులలో చాలా మందికి మెలియోయిడోసిస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదని తేలింది. నలుగురికి ఇన్ఫెక్షన్ పాజిటివ్‌గా తేలగా, ఎనిమిద...