భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయకపోతే గాజా స్ట్రిప్‌లో సైనిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని బెదిరించారు. ఈ శనివారం మధ్యాహ్నంలోపు విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. బందీలను విడుదల చేయకుంటే దీనికి ముగింపు పలుకుతామని నెతన్యాహు తాజాగా స్పష్టం చేశారు.

ఒప్పందంలో భాగంగా హమాస్ 21 మంది ఇజ్రాయెల్ వాసులను విడుదల చేసింది. ఫిబ్రవరి 15న మరింత మందిని విడుదల చేయాలని హమాస్ నిర్ణయించింది. కానీ గాజాకు సహాయ సరఫరాలను ఇజ్రాయెల్ అడ్డుకుంటుందని ఆరోపిస్తూ, శనివారం జరగాల్సిన మరో ముగ్గురు బందీల విడుదలను వాయిదా వేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. ఈ ప్రకటన ఇప్పట...