Hyderabad, ఆగస్టు 5 -- టాలీవుడ్ నటి హన్సికా మోత్వానీ, ఆమె భర్త సోహెల్ కతూరియా తెగదెంపులు చేసుకుంటున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. మూడేళ్లలోపే వీళ్ల పెళ్లి పెటాకులైనట్లే కనిపిస్తోంది. తాజాగా హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి.

హన్సిక మోత్వానీ విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు ఆమె తన తల్లి దగ్గరికి తిరిగి వెళ్లిందని కూడా తెలుస్తోంది. దీంతో ఆమె పెళ్లి పెటాకులైనట్లే అన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇక ఇప్పుడు హన్సిక ఇన్‌స్టాలోనూ వాళ్ల పెళ్లి ఫొటోలు కనిపించకుండా పోయాయి. దీంతో విడాకుల పుకార్లు నిజమేనన్నది తేలిపోయింది.

గతంలో జియో సినిమాలో వచ్చిన ఆరు ఎపిసోడ్‌ల రియాలిటీ సిరీస్ 'హన్సికాస్ లవ్ షాదీ డ్రామా'ని చూసిన ...