భారతదేశం, జనవరి 11 -- హన్మకొండ జిల్లాలో దాదాపు 300 వీధి కుక్కలను చంపిన ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 9న జంతు సంక్షేమ కార్యకర్తలు అదులాపురం గౌతమ్, ఫర్జానా బేగం దాఖలు చేసిన ఫిర్యాదులో జనవరి 6 నుండి మూడు రోజుల్లో శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో 300 వీధి కుక్కలు చంపినట్టుగా వెల్లడించారు.

సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు.. వ్యక్తులను నియమించుకుని కుక్కలకు విషం ఇచ్చి చంపి తర్వాత శాయంపేట, ఆరెపల్లి గ్రామాల శివార్లలో పాతిపెట్టారు. ఫిర్యాదు ఆధారంగా శాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధికుక్కలను హతమార్చి పాతిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధికుక్కల ప్రాణాలను బలితీసుకు...