Hyderabad, ఏప్రిల్ 12 -- దేశవ్యాప్తంగా హిందువులంతా హనుమ జయంతి పండుగను ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది హనుమాన్ జన్మోత్సవం శనివారం ఏప్రిల్ 12న జరుపుకోనున్నారు. ఈ మేరకు ఆంజనేయుని అనుగ్రహం పొందాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. మరి కొందరు పరమ భక్తులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని పిల్లలకు ఆయన పేరును పెట్టుకోవాలనుకుంటారు. అయితే చాలా మందికి తాజాగానూ, ట్రెండీగానూ ఉండాలి. అదీ కాకుండా హనుమాన్ అర్థం వచ్చేలా పేరుండాలని కోరుకుంటారు. వారందరి కోసం ఇక్కడ ఓ లిస్ట్ రెడీ చేశాం ఓ లుక్కేసేయండి మరి.

హనుమంతుని మరో పేరు ఆంజనేయ. ఈ పేరు అర్థం 'అంజనీ కుమారుడు' (హనుమంతుని తల్లి పేరు అంజన). హనుమంతుని పేర్లలో ఉండే ఈ శక్తివంతమైన పేరు తల్లి ప్రేమను సూచిస్తుంది.

హనుమంతుని మరో పేరు మారుతీ. దీనికి అర్థం 'గాలి కుమారుడు' (హనుమంతుడు గాలి దేవుని కుమారుడు...