Hyderabad, ఏప్రిల్ 12 -- దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇంట్లోనూ, ఆలయాల్లోనూ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకు ప్రతీ కరమైన ప్రసాదాలను చేసి పెట్టడం వల్ల సామి అనుగ్రహం లభిస్తుందని, ఆయన ఆశీస్సులు ఉంటే ధైర్యం, శక్తితో పాటు ఆరోగ్యం, ఆనందం కలిసి వస్తాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఈ రోజున హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలను వంటి స్వామికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఈ ఆంజనేయ వడ రెసిపీ మీ కోసమే.

హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది వడమాల. దీన్ని కొన్ని చోట్ల ఆంజనేయుడి వడ అని పిలుస్తారు. తమిళనాడులో ఇది చాలా ఫేమస్. అక్కడి ఆలయాల్లో, కొన్ని షాపుల్లో ఇవి దొరుకుతాయి. కరకరలాడుతూ ఉండే ఆంజనేయ వడలు చాలా రుచిగా ఉంటాయి. ...