Hyderabad, ఏప్రిల్ 11 -- హనుమాన్ జయంతికి స్వీట్ ప్రసాదం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీ చేతులతో మీరే నైవేద్యం తయారుచేస్తే అతడి కరుణ మీకు దక్కుతుంది. ఇక్కడ మేము జ్యూసీ బూందీ చేయడం ఎలాగో చెప్పాము. దీన్ని తయారు చేయడానికి చాలా సులువు. ఈ టేస్టీ స్వీట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. మీ ఇష్టదైవం కోసం బూందీ ఎలా చేయాలో తెలుసుకోండి

శనగపిండి - ఒక కప్పు

నీరు - మూడు కప్పులు

నూనె - ఒక టీస్పూన్

బేకింగ్ సోడా - చిటికెడు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

పంచదార - రెండు కప్పులు

యాలకుల పొడి - ఒక స్పూను

కుంకుమపువ్వు రేకులు - కొన్ని

1. శెనగపిండి జల్లించి ఉండల్లేకుండా చూసుకోవాలి.

2. ఒక కప్పు శెనగపిండి తీసుకుని అందులో ముప్పావు కప్పు నీరు కలపాలి.

3. 3. అందులో ఒక స్పూను నెయ్యి వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల బూందీ గుల్...