భారతదేశం, జూన్ 12 -- మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంంది. ప్రతిరోజూ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. జితేంద్ర రఘువంశీ. ఈ కేసులో ఈ పేరు కొత్త టర్న్ తీసుకునేలా చేస్తుందా చూడాలి. రాజా రఘువంశీ హత్య కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు. అతని భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాశ్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి అనేవారిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితులను మేఘాలయకు తరలించారు. ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.

అయితే తాజాగా ఈ కేసులో జితేంద్ర రఘువంశీ అనే పేరు తెరపైకి వచ్చింది. రాజా రఘువంశీని చంపడానికి నియమించిన వారికి ప్రాథమిక చెల్లింపులు చేయడానికి సోనమ్.. జితేంద్ర రఘువంశీ ఖాతాను ఉపయోగించుకుంది. జితేంద్ర రఘువంశీ ఎవరన్న ప్రశ్నకు ...