Andhrapradesh, జూలై 16 -- హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావటంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తైన హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ముందు ప్రకటించినట్టుగానే వంద రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది.

రూ.696 కోట్లతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్ధ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు తాగు, సాగునీరివ్వాలన్న సంకల్పంతో రోజువారీ టార్గెట్లు నిర్ణయించి. పనులు చేపట్టారు. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి సామర్ధ్యంతో నీ...