భారతదేశం, మే 26 -- అవినీతిర‌హితంగా, పార‌ద‌ర్శ‌కంగా, స‌మయాన్ని ఆదా చేయాల‌నే ఉద్దేశంతో.. రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ నేప‌ధ్యంలో ఆధార్ -ఈ సంతకం విధానాన్ని కూడా వీలైనంత త్వ‌ర‌గా అమ‌లులోకి తీసుకువ‌రావాల‌ని.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి అధికారుల‌ను ఆదేశివంచారు. ఈ ఆధార్‌-ఈ సంత‌కం వల్ల 10 నుంచి 15 నిముషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని వివరించారు.

సోమ‌వారం స‌చివాల‌యంలోని తన కార్యాల‌యంలో.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ఐజీ జ్యోతి బుద్ధ‌ప్ర‌కాష్‌తో క‌లిసి.. స్లాట్ బుకింగ్ విధానం, ప‌నిభారం అధికంగా ఉన్న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అద‌న‌పు రిజిస్ట్రార్‌ల పోస్టింగ్‌, ప‌దోన్న‌తి పొందిన ఉద్యోగుల‌కు పోస్టింగ్‌ల‌పై మంత్రి స‌మీక్షించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడు...