భారతదేశం, జూలై 8 -- తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు.

వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్ - జూన్ మ‌ధ్య రాష్ట్రానికి 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేశార‌ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు రావ‌డం, వ్యవసాయ ప‌నులు జోరుగా సాగుతున్న స‌మ‌యంలో యూరియా స‌ర‌ఫ‌రా కాక‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు.

జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్ప‌త్తయిన యూరియా 63 వేల మెట్రిక్ ట‌న్నులుగా ఉంది. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న యూరియా 97 వేల మెట్...