Bengaluru, జూలై 1 -- స్విగ్గీ, జొమాటోలకు పోటీగా మరో ఫుడ్ డెలివరీ యాప్ మార్కెట్లోకి వస్తోంది. దీనిని 'ఓన్లీ (Ownly)' పేరుతో ట్యాక్సీ సర్వీసెస్ యాప్ రాపిడో లాంచ్ చేస్తోంది. దీనిని బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించడానికి రాపిడో సన్నద్ధమవుతోంది. కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, సర్జాపూర్ ప్రాంతాల్లో వచ్చే 8 నుంచి 10 రోజుల్లో మొదట పరీక్షించనున్నారు. వచ్చే ఏడాది జూలై నాటికి మరో పది నగరాలకు విస్తరించాలని లక్షంగా పెట్టుకుంది.

తొలుత ఆగస్టులో పెద్ద ఎత్తున ప్రారంభించాలని భావించిన ఈ గడువును జూలైలో చిన్న ప్రయోగానికి మార్చారు. మొదటి కొన్ని నెలలు బెంగళూరు ప్రధాన దృష్టి పెడుతుందని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి మరో రెండు మూడు నగరాలకు క్రమంగా విస్తరిస్తుందని నివేదిక పేర్కొంది. ప్రోసస్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్, వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్...