భారతదేశం, ఏప్రిల్ 23 -- అంధులు లేదా దృష్టి లోపం ఉన్న వినియోగదారులు భారతదేశంలోని అతిపెద్ద డెలివరీ యాప్ లను ఉపయోగించి కిరాణా వస్తువులు లేదా భోజనాన్ని స్వతంత్రంగా ఆర్డర్ చేయగలిగేలా లేవని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. స్విగ్గీ, జెప్టో సంస్థలు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లను అంధులు లేదా దృష్టి లోపం ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టు లో ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తమ స్పందన తెలియజేయాలని స్విగ్గీ, జెప్టో, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది.

స్విగ్గీ, జెప్టో తదితర ఫుడ్ లేదా గ్రోసరీ డెలివరీ యాప్ లు అంధులు లేదా దృష్టి లోపం ఉన్న వినియోగదారు...