భారతదేశం, మే 14 -- ఆపరేషన్ సిందూర్ పేరుపై భారత్ సాగించిన ముప్పేట దాడితో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయే పరిస్థితి నెలకొంది. బలూచిస్తాన్ ఉద్యమకారులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.

పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం ప్రకటించుకుంటూ బలూచిస్థాన్ జాతీయవాద నాయకులు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. బలూచిస్తాన్ వీధుల్లో ఉద్యమకారులు తమ ప్రత్యేక జెండాతో ప్రదర్శనలు నిర్వహించారు. అదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో "రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్" అనే పదం ట్రెండింగ్ గా మారింది.

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత, భారత్ తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ పై విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోకి చొరబడి, వైమానిక దాడులతో ఆ దేశంలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ దాడుల్లో జ...