భారతదేశం, డిసెంబర్ 26 -- స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షేర్లలో లాభాలు పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ 24 (బుధవారం) నాటి ట్రేడింగ్‌లో నిఫ్టీ 50 స్వల్ప నష్టాలతో 26,142.10 వద్ద ముగిసింది. పండగ సీజన్ కావడంతో ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉండటం, క్యూ3 (Q3) ఫలితాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటంతో మార్కెట్ కొంత మందకొడిగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో రెలిగేర్ బ్రోకింగ్ ఎస్‌వీపీ (పరిశోధన) అజిత్ మిశ్రా స్పందిస్తూ.. మార్కెట్‌లో కొత్త ఊపు రావాలంటే బ్యాంక్ నిఫ్టీ కనీసం 59,500 పాయింట్ల స్థాయిని దాటాలని అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు ఇన్వెస్టర్లు స్టాక్-స్పెసిఫిక్ అప్రోచ్‌ను (నిర్దిష్ట షేర్ల ఎంపిక) అనుసరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు, మెటల్స్, ఆటో రంగాలపై దృష్టి ప...