భారతదేశం, జూన్ 10 -- స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు ఉంటారు. కో ఛైర్మన్‌గా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో ఆసుపత్రి వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, సతీశ్ రెడ్డి, జీఎం రావు, ఎల్అండ్‌టీ ఛైర్మన్ సుబ్రమణ్యన్, టీవీఎస్ మోటర్ ఛైర్మన్ వేణు శ్రీనివాస్, సీఎస్ విజయానంద్ ఉండనున్నారు.

ఇప్పటికే స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించడానికి 26 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం నుండి ప్రారంభించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులను ఉద్దేశించి ఆన్‌లైన్ వీడియో మోడ్‌లో ముఖ్యమ...