భారతదేశం, జూన్ 10 -- అమరావతి: 'స్వర్ణాంధ్ర 2047' విజన్‌ను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో, 175 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్' కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యాలయాల ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ధికి కొత్త చరిత్ర ఆరంభమైందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదు. ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరింది. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 ...