భారతదేశం, డిసెంబర్ 9 -- రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 18 అడుగుల ఎత్తుతో విగ్రహాలను నిర్మించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2009లో డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజలు కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. ప్రతీ ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మెుదలు పెట్టేందుకు విగ్రహ...