Kaleshwaram,telangana, ఏప్రిల్ 20 -- దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు రెడీ అవుతోంది. ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో చివరగా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఈ పుష్కరాలు జరగగా.. ఈసారి మే 15 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కొద్దిరోజుల కిందట ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాకు దేశవ్యాప్తంగా కోట్ల మంది తరలిరాగా.. సరస్వతీ పుష్కరాలకు కూడా భారీ స్థాయిలో భక్తులు వస్తారని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు స్వరాష్ట్రంలో తొలిసారి నిర్వహించే సరస్వతీ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టింది. వివిధ పనుల కోసం రూ.25 కోట్లు మంజూరు చేయగా, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది.

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసా...