Hyderabad, జూలై 14 -- మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు భయంకరమైనవి ఉంటాయి, కొన్ని కలలు మామూలుగా ఉంటాయి, ప్రశాంతంగా అనిపిస్తాయి. ఒక్కోసారి పీడ కలలు వస్తూ ఉంటాయి. అలాంటిప్పుడు మాత్రం అందరూ భయపడిపోతూ ఉంటారు.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలకు అర్థాలు ఉంటాయి. కలలు మన భవిష్యత్తులో జరిగే విషయాలను సూచిస్తాయి. కలలో వెలుగుతున్న దీపం కనబడితే దానికి అర్థం ఏంటి? అది శుభ ఫలితాన్ని ఇస్తుందా? సమస్యలు ఏమైనా వస్తాయా వంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

ఒక్కోసారి కలలో వెలుగుతున్న దీపం కనపడుతూ ఉంటుంది. కలలో వెలుగుతున్న దీపం కనబడితే దానికి అర్థం ఏంటి అనే విషయానికి వస్తే, కలలో వెలుగుతున్న దీపాన్ని చూడడం మంచిదే. చిరకాల కోరిక నెరవేరిపోతుందని సూచిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

దీపం వెలుగుకి చిహ్నం. వెలుగుతున్న దీపాన్ని మనం కలలో...