Hyderabad, ఆగస్టు 24 -- సంగీతంతో ఎంతోమంది ప్రశాంతతను ఫీల్ అవుతుంటారు. ఇటీవల కాలంలో వివిధ భాషల్లో ఎన్నో మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ సంగీతాన్ని అందిస్తున్నాయి. నేటి యువతరం సింగర్స్, మ్యూజిషియన్స్‌గా పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే, అలాంటి యువ ప్రతిభావంతులైన బృందంతో కలిసి స్వచ్ఛమైన సంగీతాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్. తెలుగు సంగీత ప్రపంచంలో స్వతంత్ర, ఒరిజినల్ కంటెంట్ చాలా అరుదుగా వస్తున్న ఈ రోజుల్లో కొత్తతరం మ్యూజిక్ అండ్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ మార్కెట్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ టీమ్‌తో కలిసి స్వచ్ఛమైన కథలతో, ఆత్మను తాకే సంగీతాన్ని సృష్టిస్తున్నామని, అదే తమ లక్ష్యమని క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బృందం పేర్కొంది. మా దృష్టి కేవలం సంగీతంపైనే కాకుండా దానిని ప్రతి...