భారతదేశం, డిసెంబర్ 7 -- ఇండియన్ వుమెన్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం (డిసెంబర్ 7) ఈ ఇద్దరూ వేర్వేరుగా తమ ఇన్ స్టా స్టోరీల ద్వారా వివాహం రద్దు ప్రకటన చేశారు. అయితే పలాష్ తన పోస్ట్ ద్వారా వార్నింగ్ కూడా ఇచ్చాడు. నిజానికి నవంబర్ 23న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి జరగాల్సింది. కానీ ఆ రోజు ఉదయం స్మృతి మంధాన తండ్రికి హార్ట్ స్ట్రోక్ రావడం, పలాష్ కూడా హాస్పిటల్లో చేరడంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు మొత్తానికే రద్దయింది.

స్మృతి మంధానతో పెళ్లి క్యాన్సిల్ అవడంపై పలాష్ ముచ్చల్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ''నేను నా జీవితంలో ముందుకు సాగాలని, నా వ్యక్తిగత సంబంధాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నాకు అత్యంత పవిత్రమైన దానిపై నిరాధారమైన పుకార్ల గురించి ప్రజలు ఇంత స...