భారతదేశం, నవంబర్ 20 -- క్రికెటర్ స్మృతి మంధాన, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో తన నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. అంతేకాదు తన పెళ్లి గురించి కూడా ఆమె హింట్ ఇచ్చింది. మున్నాభాయ్ మూవీలోని ఓ సాంగ్ తో కూడిన ఓ ఫన్నీ వీడియోను జెమీమా రోడ్రిగ్స్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా గురువారం (నవంబర్ 20) తన వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్మేట్స్ జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంకా పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డితో కలిసి చేసిన ఓ రీల్ వైరల్ అయింది. వీడియోలో.. మొదట జెమీమా.. స్మృతిని చూసి "భాయ్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. విషయం ఏంటి?" అని అడుగుతుంది. స్మృతి ఆనందంగా ఈల వేస్తుంది.

బ్యాక్‌గ్రౌండ్ లో 'లగే రహో మున్నాభాయ్' మూవీలోని "సంఝో హో హీ గయా" పాట ప్లే అవుతుండగా వాళ్లు డ్య...