భారతదేశం, నవంబర్ 21 -- భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మ్యూజిక్ కంపోజర్-ఫిల్మ్‌మేకర్ పలాష్ ముచ్చల్‌తో తన నిశ్చితార్థాన్ని ధృవీకరించిన విషయం తెలుసు కదా. ఆమె తన నిశ్చితార్థాన్ని తన టీమ్‌మేట్స్‌తో కలిసి చేసిన ఒక సరదా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో అనౌన్స్ చేయడం ఇంటర్నెట్‌ను ఆకర్షించింది. మరి ఆమెకు కాబోయే భర్త పలాష్ ఎవరు? ఏం చేస్తాడు అన్న వివరాలు మీకు తెలుసా?

స్మృతి మంధాన గురువారం (నవంబర్ 20) ఓ వీడియోలో కనిపించిన విషయం తెలుసు కదా. వైరల్ అయిన ఈ క్లిప్‌లో ఆమె తన టీమ్‌మేట్స్‌ అయిన జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌తో కలిసి 'లగే రహో మున్నా భాయ్' సినిమాలోని "సంఝో హో హీ గయా" పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ద్వారానే తన ఎంగేజ్‌మెంట్ గురించి ఆమె చెప్పింది. అంతేకాదు వీరిద్దరి వివాహం నవంబర్ 23న జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి....