భారతదేశం, నవంబర్ 25 -- ఫిల్మ్‌మేకర్, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్, ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానల పెళ్లి వాయిదా పడిన విషయం తెలుసు కదా. ఆదివారం అంటే నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో వీళ్ల పెళ్లి జరగాల్సింది. అయితే ఇటు స్మృతి తండ్రి, అటు పలాష్ ఇద్దరూ అనారోగ్యం బారిన పడటంతో వాయిదా వేశారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.

అయితే స్మృతి మరుసటి రోజే పెళ్లికి సంబంధించిన అన్ని పోస్టులను ఇన్‌స్టా నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమెను పలాస్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా తర్వాత మేరీ డి'కోస్టా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రెడిట్‌లో కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు. అవి పలాష్ ముచ్చల్‌తో తాను చేసిన చాటింగ్ అంటూ ఆ యూజర్...