భారతదేశం, నవంబర్ 26 -- ప్రపంచ కప్ విజేత క్రికెటర్ స్మృతి మంధాన, ఆమె కాబోయే భర్త పలాష్ ముచ్చల్ ల మధ్య బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉన్నాయి. స్మృతి తన కాబోయే భర్తను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒక స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది. అందులో స్మృతి మంధాన.. పలాష్‌ను ఫాలో అవ్వడం లేదని తెలుస్తోంది. ఆమె ఫాలో అవుతున్న వారిలో 'పలాష్' అని వెతికితే, 'ఎవరూ కనిపించలేదు' అని వస్తోంది.

స్మృతి మంధాన తనకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ ను అన్ ఫాలో చేసిందనే వార్తల్లో నిజం లేదు. హిందూస్థాన్ టైమ్స్ చెక్ చేసినప్పుడు ఇది స్పష్టమైంది. సెర్చ్ రిజల్ట్స్‌లో పలాష్ ముచ్చల్ పేరుతో అకౌంట్ కనిపించింది. దీని అర్థం.. స్మృతి మంధాన ఇప్పటికీ పలాష్ ముచ్చల్‌ను ఫాలో అవుతోంది.

స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని సోషల్ ...